డ్రైవర్ లేకుండా మెట్రో పరుగు

Posted On:31-12-2014
No.Of Views:342

మెట్రో రైలు మరో ముందడుగు వేసింది. డ్రైవర్ లేకుండా ఆటోమెటిక్‌గా సాగే అరుదైన ఆధునిక సాంకేతిక విధానాన్ని సమకూర్చుకున్న మొట్టమొదటి మెట్రో రైలు ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. ఈ విధానాన్ని మంగళవారం రాత్రి అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. డ్రైవర్ లేకుండా తన గమనాన్ని, వేగాన్ని ఎప్పటికపుడు నియంత్రించుకుంటూ మెట్రో నడుస్తుందని అధికారులు తెలిపారు.
అవసరమైనపుడు బ్రేక్‌లు కూడా ఆటోమెటిక్‌గా పడే విధంగా రూపకల్పన చేశారు. డ్రైవర్ కేవలం రైలు తలుపులు మూసే బటన్‌ను ఆపరేట్ చేస్తే చాలు. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ఏటీవో) పద్ధతిలో నడిచి, కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. డ్రైవరుతో సంబంధం లేకుండా తనంతట తానే పరుగులు తూస్తూ, గమనాన్ని, వేగాన్ని నియంత్రించుకొని, అవసరమైనప్పుడు బ్రేకులు వేసుకుంటుంది.
డ్రైవల్ కేవలం స్టేషన్లో ప్రయాణీకులను గమనిస్తూ రైలు తలుపులను మూసే మీటను నొక్కడానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ ప్రయాణంలో పలు కీలక పరీక్షలను మెట్రో రైలు విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లను ప్రయోగాత్మకంగా టెస్ట్ రన్ చేస్తున్నారు. ఆగస్టు నుండి పలు టైస్ట్ డ్రైవ్‌లు చేస్తున్నారు. ఏటీవోను మంగళవారం రాత్రి తొలిసారి పరీక్షించారు.
కమ్యూనికేషన్ ఆధారిత ట్రెయిన్ నియంత్రణ వ్యవస్థ (సీబీటీసీ)ను భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రోలో అమలు చేయనున్నారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన థాలేస్ కంపెనీ హైదరాబాద్ మెట్రోకు అందిస్తోంది. ఈ రేడియో సమాచార ఆధారిత వ్యవస్థ రైళ్ల గమనాన్ని నిరంతరం ప్రసారం చేస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే రైళ్లు ఒకదానితో ఒక్కటి రేడియో ద్వారా మాట్లాడుకుంటాయన్నమాట. మెట్రో రైలులోని సాంకేతిక వ్యవస్థ మొత్తం ఆరు జోన్లుగా ఉంటుంది. జోన్ కంట్రోలర్ ద్వారా ప్రతి రైలు ఉనికిని, గమనాన్ని, వేగాన్ని మిగతా రైళ్లకు నిరంతరం తెలియజేస్తుంది. ఆ మేరకు రైళ్లు తమ వేగాన్ని నియంత్రించుకుంటూ అవసరమైనప్పుడు వాటంతట అవే బ్రేకులు వేసుకుంటాయి.
ఆటోమేటిక్ ట్రైన్ సూపర్ విజన్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటేక్షన్, జోన్ కంట్రోలర్, డేటా కమ్యూనికేషన్ తదితర అనేక ఉపవ్యవస్థలు, మెట్రో రైళ్లు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు, ఢీకొట్టకుండా ఉండేలా పర్యవేక్షిస్తాయి. మానవ తప్పిదాల కలిగే ప్రమాదాల నుండీ, హెచ్చరిక సంకేతాలను దాటి రైలు ముందుకు వెళ్లకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం కాపాడుతుంది. ఆటోమెటిక్ ట్రెయిన్ ఆపరేషన్ వ్యవస్థకు సంబంధించి మెయిన్ కంట్రోల్‌ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మొత్తం 72 కిలోమీటర్ల పొడవునా హైదరాబాద్ మెట్రోరైలు వ్యవస్థ పనిచేస్తుంది.
అత్యాధునిక సీబీటీసీ వ్యవస్థ కారణంగా హైదరాబాదు మెట్రో సంస్థకు ప్రతి 90 సెకన్లకు ఒక రైలును నడిపే సామర్థ్యం ఉంది. రైలులో ఏదైనా పరికరం చెడిపోతే వేరే పరికరం తనంతట తానే అందుబాటులోకి వస్తుంది. ఈ తరహా సాంకేతికతను వినియోగిస్తున్న హైదరాబాదు మెట్రోను చూసి ఢిల్లీ మోట్రో తర్వాతి దశను ఈ విధానంలో అమలు చేయనున్నారని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
దేశంలో భవిష్యత్తులో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా హైదరాబాద్ మెట్రోసిబిటిసి విధానాన్నే అమలు చేయనున్నారు. హాంకాంగ్‌కు చెందిన సైమన్ లీ అనే నిపుణుణ్ని హైదరాబాద్ మెట్రోరైలు సిగ్నల్స్ పరిశీలకుడిగా నియమించనున్నట్లు అధికారులు తెలిపారు.