ధొనిథో రిలేషన్ ఓ చేదు జ్ఞాపకం

Posted On:01-01-2015
No.Of Views:326

భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీతో తన సంబంధం పైన వచ్చిన ఆరోపణలు ఓ చేదు జ్ఞాపకమని ప్రముఖ తమిళ నటి రాయ్ లక్ష్మీ (గతంలో లక్ష్మీ రాయ్) చెబుతోంది. ఇప్పటికీ తమ రిలేషన్ షిప్ పైన పలు వార్తలు రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. లక్ష్మీరాయ్‌కి మూడు రిలేషన్‌షిప్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆమె ఇటీవల మాట్లాడుతూ.. ధోనీతో తన సంబంధం ఓ చేదు జ్ఞాపకమని, మచ్చ అని అది తనను చాలాకాలం వేధిస్తుందని చెప్పింది. తమ అఫైర్ విషయమై ఇప్పటికీ చర్చ సాగడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పింది. పలు సందర్భాలలో టీవీ ఛానల్స్ మహేంద్ర సింగ్ ధోనీ గతాన్ని తవ్వుతారని, అప్పుడు తమ మధ్యన ఉన్న రిలేషన్ షిప్‌ను చెబుతుంటారని వాపోయింది. ఇలాగే చేస్తే భవిష్యత్తు పైన తనకు భయం కలుగుతోందని చెప్పింది. ఒకవేళ తన పిల్లలు తమ మధ్య అఫైర్ గురించి టీవీలలో చూసి, ప్రశ్నిస్తే ఎలా అని వాపోయింది. ధోనీ తర్వాత తనకు ముగ్గురు, నలుగురితో రిలేషన్‌షిప్ ఉందని, కానీ ఎవరు కూడా దానిని పట్టించుకోలేదని చెప్పింది. మహేంద్ర సింగ్ ధోనీ గురించి తనకు పూర్తిగా తెలుసునని, ఇప్పటికీ తాము ఇద్దరం గౌరవం ఇచ్చి పుచ్చుకుంటామని తెలిపింది. అతనికి పెళ్లయిందని, తాను పని పైన పూర్తి శ్రద్ధ పెడుతున్నానని తెలిపింది.