డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రముఖ బుల్లితెర నటుడు

Posted On:01-01-2015
No.Of Views:302

ముంబై: ప్రముఖ టీవి నటుడు 'బాలికా వధు' ఫేం సిద్దార్ధ శుక్లా డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోయారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తాగి కారు నడుపుతూ శుక్లా ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. నూతన సంవత్సర వేడుకలకు ఫేమస్ స్పాట్ అయిన జుహు బీచ్ వెళుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు సిద్దార్ధ శుక్లా ఒక్కడే కారు నడుపుకుంటూ వెళుతున్నాడని, ఆ సమయంలో అతను పుల్‌గా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రూ. 2000 జరిమానా విధించారు. సిద్దార్ధ శుక్లా డ్రైవింగ్ లైసెన్సుని డీఎన్ నగర ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "బాలికా వధు" సిద్దార్ధ శుక్లా నటించిన పాపులర్ బుల్లితెర సీరియల్.