ప్రధానితో టీమిండియా

Posted On:01-01-2015
No.Of Views:338

 2015 కొత్త సంవత్సరం నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల క్రీడాకారులు గురువారం నాడు మధ్యాహ్నం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఆబాట్‌ను ఆయన నివాసంలో కలిశారు. కిర్రిబిల్లి హౌస్ ప్రధాని రెండో అధికారిక నివాసం. ఇక్కడ ప్రధానితో కలిసి ఇరు జట్ల సభ్యులు ఫోటోలు దిగారు. భారత క్రికెట్ ప్లేయర్లు టీ షర్ట్స్, ట్రజర్స్‌తో కలిపి ప్రధానితో దిగిన ఫోటోను బీసీసీఐ సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ట్విట్టర్లో పెట్టింది. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ నూతన సంవత్సరం తొలిరోజు వారికి టీ విందు ఇచ్చారని బీసీసఐ పేర్కొంది. మరో ఫోటోలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కౌంటర్‌పార్ట్ స్టీవెన్ స్మిత్, టోనీ అబాట్ ఉన్నారు. అయితే, మెల్‌బోర్న్ టెస్ట్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ ఫోటోలలో కనిపించలేదు. అయితే, ఈ కార్యక్రమానికి అతను అటెండ్ అయ్యాడా లేదా తెలియాల్సి ఉంది. మరోవైపు, డిసెంబర్ 6న నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనీ భారత్ తిరిగి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కోచ్‌గా హసీ పేరును తెరపైకి తెచ్చిన ధోనీ ప్రస్తుతం భారత్ కోచ్‌గా ఉన్న డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ప్రపంచ కప్‌తో ముగియనుంది. ఆ తర్వాత కోచ్ ఎవరన్న దాని పైన ధోనీ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అయితే భారత జట్టుకు బాగుంటుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన బీసీసీఐకి సూచించారని అంటున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్ం వహించిన సమయంలో హసీతో ధోనీకి సాన్నిహిత్యం ఏర్పడింది. హసీ వ్యవహారశైలి మాజీ కోచ్ కిర్‌స్టన్‌ను పోలీ ఉంటుంది. వ్యక్తిగా ప్రశాంతంగా ఉండే హసీ ఆటలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తాడు. పరిస్థితులకు తగినట్లుగా ప్రణాళికలు రచించడంలో దిట్ట. అందరిని కలుపుకొని పేయే వ్యక్తి.