కొత్త 2015 హోండా సిఆర్-వి ఆవిష్కరణ

Posted On:01-01-2015
No.Of Views:304

జపనీస్ కార్ మేకర్ హోండా అందిస్తున్న ఎస్‌యూవీ 'సిఆర్-వి' (CR-V)లో కంపెనీ ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హోండా సిఆర్-వి ముందుగా గ్లోబల్ మార్కెట్లలో లభ్యం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.హోండా తమ అప్‌డేటెడ్ సిఆర్-వి ఎస్‌యూవీని తొలిసారిగా 2014 ప్యారిస్ మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శనకు ఉంచింది. కాగా.. కంపెనీ ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ రెడీ మోడల్‌ను ఆవిష్కరించింది. కొత్త హోండా సిఆర్-విలో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.రీస్టయిల్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్, కొత్త బంపర్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, స్కిడ్ గార్డ్స్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో కొత్త 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు. దీనిని యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు.ఈ టచ్‌స్క్రీన్ సిస్టమ్ రియర్ వ్యూ కెమెరా మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో ఆప్షనల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ఇంటర్నెట్ రేడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. యూరోపియన్ వెర్షన్ మోడల్‌లో మిర్రర్ లింక్ అనే సరికొత్త టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియంగా కనిపించే డ్యాష్‌బోర్డ్, అక్కడక్కడా క్రోమ్ గార్నిష్‌తో దీని ఇంటీరియర్స్ మంచి ప్రీమియం ఫీల్‌నిస్తాయి.ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త హోండా సిఆర్-వి ప్రస్తుత 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, ఇండియన్ మార్కెట్ కోసం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇందులో 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.