మొబైల్ ‘ఒప్పో ఆర్5’, కొత్త ఏడాది కొత్త స్లిమ్

Posted On:01-01-2015
No.Of Views:281

స్మార్ట్‌ఫోన్‌లు ఎంత స్లిమ్‌గా ఉంటే అంత డిమాండ్. పల్చటి ఫోన్‌లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతోన్న నేపధ్యంలో చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో,,  పేరుతో సరికొత్త స్లిమ్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.29,990. కేవలం 4.85 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ముందస్తు బుకింగ్‌లను జనవరి 1, 2015 నుంచి స్వీకరిస్తామని ఒప్పో ఇండియా సీఈఓ టామ్‌లూ పేర్కొన్నారు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ 64బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ ఐఎమ్ఎక్స్214 బీఎస్ఐ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (83 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), కలర్ ఓఎస్ 2.0 (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, యూఎస్బీ).