తమను తామే పేల్చేసుకున్న పాకిస్థాన్‌ మరపడవ సిబ్బంది

Posted On:02-01-2015
No.Of Views:324

 గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరం వద్ద తీరరక్షకదళం అధికారులు పాకిస్థాన్‌కి చెందిన ఒక మరపడవను గుర్తించారు. గుర్తించిన వెంటనే వారు దాదాపు గంటపాటు దానిని వెంబడిరచారు. దాంతో ఆ మరపడవలో ఉన్న సిబ్బంది తమను తామే పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీలోని కేతిబందుర్‌కు చెందిన ఈ మరపడవ నలుగురు వ్యక్తులు, భారీ ఎత్తున పేలుడు సామగ్రితో భారత్‌ తీరంలోకి ప్రవేశిస్తుండగా తీరరక్షకదళం గుర్తించింది. డిసెంబరు 31న రాత్రి పోరుబందర్‌ తీరానికి 365 కి.మీ. దూరంలో ఈ సంఘటన జరిగింది. ముంబయి బాంబు పేలుళ్ల ఘటన జరిగి ఆరేళ్లు పూర్తయి నెల రోజులు కావస్తుండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.పాకిస్థాన్‌లోని కేతిబందర్‌ నుంచి మరపడవ ద్వారా కొందరు వ్యక్తులు భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తారన్న నిఘా వర్గాల సమాచారంతో తీర రక్షక దళం అప్రమత్తమైంది. దీంతో అరేబియా సముద్ర తీరంలో గస్తీ మరింత పెంచింది. అంతేకాకుండా రీ।కాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ని రంగంలోకి దించి తీర ప్రాంతంలో అణువణువు శోధించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోరు బందర్‌కు 365 కి.మీ. దూరంలో అనుమానాస్పదంగా మరపడవ సంచరించడాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ సిబ్బంది గుర్తించారు. వెంటనే తీరరక్షక దళాన్ని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మర పడవలో ఉన్నవారికి హెచ్చరికలు జారీ చేశారు. వివరాలు తెలపాల్సిందిగా కోరగా, అందులోని వారు పడవ వేగాన్ని పెంచి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో తీర రక్షక దళం సుమారు గంటకుపైగా మరపడవను వెంబడిరచింది. చివరకు హెచ్చరికగా కాల్పులు జరపడంతో ఎట్టకేలకు మరపడవను ఆపగలిగారు. అయితే రక్షణ సిబ్బంది హెచ్చరికలను పడవలోని వారు బేఖాతరు చేశారు. అనంతరం కొద్దిసేపటికే పడవలోని వారు తమంత తామే పేల్చేసుకున్నారు. వేగంగా గాలులు వీయడం, వాతావరణం అనుకూలించకపోవడంతో కాలిపోతున్న పడవలోని వారిని పట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఉన్నతాధికారులు తెలిపారు. పడవలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించామని వారు తెలిపారు. 2008లో కూడా ఓ చిన్న పడవ ద్వారా 10మంది ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించి ముంబయిలో విధ్వంసకాండ సృష్టించారు. ఈ ఘటనలో 166మంది మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.