నిజాం గారు చాలా నిజంగానే చాలా గొప్ప రాజు:షబ్బీర్‌ అలి

Posted On:03-01-2015
No.Of Views:280

 ఆస్పత్రుల నిర్మాణాల విషయంలో నిజాం రాజు గొప్పరాజు అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినమాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలి వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆరోగ్యంకోసం నిజాం గారు చేసిన కృషి చాలా ఉంది అని ఆయన శ్లాఘించారు. ఉస్మానియా ఆస్పత్రి, గాంధి ఆస్పత్రి,, క్యాన్సర్‌ ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి,, పాగల్‌ఖానా, చెస్ట్‌ ఆస్పత్రి ... ఇలా మనిషికి ఎన్ని భాగాలు ఉన్నయో అన్ని ఆస్పత్రులు నిజాం కట్టించారని ఆయన గుర్తు చేశారు. నిజాం రాజు కట్టించినన్ని దవాఖానాలు మరే రాజూ కట్టించలేదని ఆయన అన్నారు.నిజాం చేసిన మిగిలిన విషయాలగురించి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడను గాని నిన్నటి మాటలు మాత్రం ఒపకుంటానని ఆయన చెప్పారు. దేశంలో 300 మంది పైగా రాజులు ఉన్నా పేదల ఆరోగ్యం కోసం ఎవ్వరూ ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆరునెలల పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ పాలనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.