కారెక్కనున్న గట్టు?

Posted On:03-01-2015
No.Of Views:358

 తెలంగాణ రాష్ట్రంలో వైసీపీకి మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా అనంతరం అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఆయన అనుచరులు తెలిపారు. ఇటీవలే కొందరు నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు మిగిలన నేతలు కూడా పార్టీ వీడనుండడంతో తెలంగాణలో త్వరలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి