ధోనీపై థియేటర్ ఆర్టిస్ట్ టామ్ ఆల్టర్ సంచలన వ్యాఖ్యలు

Posted On:04-01-2015
No.Of Views:330

భారతదేశానికి ప్రాతినిధ్యం వహించకుండా మహేంద్ర సింగ్ ధోనీ పైన నిషేధం విధించాలని థియేటర్‌ ఆర్టిస్ట్‌ టామ్‌ ఆల్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్‌ మధ్యలో తప్పుకున్నందున ధోనీపై వేటు వేయాలని ఓ ఇంటర్వ్యూలో అతను డిమాండ్‌ చేశాడు. లాలా అమర్నాథ్, నవజ్యోతి సింగ్ సిద్ధూ కూడా ధోనీలో గతంలో మధ్యలోనే వచ్చారు. ఈ నేపథ్యంలో టామ్... ఆ ఇద్దరి విలన్లుగా, ద్రోహులుగా ముద్రపడ్డారని, ఇప్పుడు ధోనీ కూడా సిరీస్‌ను మధ్యలో తప్పుకున్నాడని చెప్పారు. ధోనీ తనను తొలగించడానికి ముందే అతను తనకు తాను బయటకు వచ్చాడని చెప్పాడు. ఇది సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ధోనీని దేశానికి ప్రాతినిథ్యం వహించకుండా నిషేధించాలని డిమాండ్ చేశాడు. అతను కేవలం తన కాంట్రాక్ట్‌ను మాత్రమే కోల్పోలేదని,క్రికెట్‌ను అమితంగా ప్రేమించి తమలాంటి వారిని కూడా వంచించాడన్నాడు. చూయింగ్‌ గమ్‌... నా నేస్తం: రిచర్డ్స్ మైదానంలో తన బ్యాటింగ్‌ ఏకాగ్రతకు చూయింగ్ గమ్ కారణమని, అది తన ప్రియ నేస్తమని వివియన్ రిచర్డ్స్‌ చెప్పాడు. అరవీర భయంకరులైన పేస్‌ బౌలర్లును హెల్మెట్‌ లేకుండా ఎదుర్కొంటున్న సమయంలోనూ చూయింగ్‌ గమ్‌ ఉంటే చాలు తన ఏకాగ్రత చెక్కుచెదిరేది కాదన్నాడు.