ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: జయప్రద

Posted On:04-01-2015
No.Of Views:295

 ‘‘మొన్నమొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలో ఇంకా టైముంది కదా? త్వరలోనే వెల్లడిస్తా’’ అని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు.ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో సమావేశం కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హరీశ్‌రావు తన సోదరుడు లాంటివారని, మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసానని ఆమె స్పష్టం చేశారు.