నిరుద్యోగులకు టీవీ ఆర్టిస్ట్ టోకరా

Posted On:05-01-2015
No.Of Views:317

 టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్ట్ నిరుద్యోగులకు టోకరా వేశాడు. లక్షల రూపాయల మేరకు దండుకుని ...ఆనక అడిగితే బెదిరింపులకు దిగాడు. వివరాల్లోకి వెళితే పలు సీరియల్స్లో నటించిన బొప్పన విష్ణువర్థన్ అనే టీవీ ఆర్టిస్ట్ ....తాను హీరోగా సీరియల్ నిర్మిస్తున్నామని, భాగస్వామిగా చేర్చుకుంటామని...అందుకోసం కొందరి వద్ద డబ్బులు వసూలు చేశాడు.అయితే ఎంతకీ సీరియల్ ప్రారంభం కాకపోవటంతో ...తిరిగి డబ్బులు చెల్లించాలని కోరిన ప్రసాద్ అనే వ్యక్తికి ...తనకు , ఉన్నతాధికారి తెలుసునంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో బాధితుడు విష్ణువర్థన్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.