కాంగ్రెస్‌కు రుద్రరాజు గుడ్‌బై!

Posted On:05-01-2015
No.Of Views:275

కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు పార్టీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకొని టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసినా గుర్తింపు లేదనే కారణంతో కొంతకాలంగా ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.ఇదే సమయంలో టీడీపీ నేతలు కొందరు పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతోపాటు ఇటీవల ఆయన్ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో రుద్రరాజు పద్మరాజు టీడీపీలో చేరేందుకు సమ్మతించినట్లు తెలిసింది. కాగా రుద్రరాజుతో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫోన్లో మాట్లాడి తొందరపడొద్ద్దని సలహా ఇచ్చినట్లు సమాచారం.