రెండు రైళ్లు ఢీ: 40 మందికి గాయాలు

Posted On:05-01-2015
No.Of Views:306

 బ్రెజిల్ రియోడిజనీరో రాష్ట్రంలో రెండు లోకల్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మెస్కెట్టా పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైలు ఆగి ఉంది. అదే ట్రాక్పైకి మరో రైలు వచ్చి ఆగి ఉన్న రైలును ఢీ కొట్టింది. రైల్వే అధికారుల ,వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.