సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Posted On:05-01-2015
No.Of Views:351

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న హయత్‌నగర్‌ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలు, ఓ సెక్స్‌వర్కర్‌, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. దేశబట్టెన ,సుబ్రహ్మణ్యనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ఆ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకురాలు విజయలక్ష్మి, సెక్స్‌వర్కర్‌తో పాటు రాగన్నగూడకు చెందిన విటుడు జి.రవిచంద్రకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్‌ను రెస్క్యూ హోంకు, విటుడిని, నిర్వాహకురాలిని జైలుకు తరలించారు. కాగా, పోలీసులు జవహర్ నగర్ సాకేత్ ఫేజ్ 2లోని ఓ బ్రోతల్‌పై దాడి చేసి ఓ మహిళకు విముక్కి కలిగించారు. 26 ఏళ్ల మహిళా నిర్వాహకురాలు లక్ష్మి మైథిలిని, విటుడు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి నివాసి. ఆ ఇంటిని ఆమె ఏడాది క్రితం అద్దెకు తీసుకుని బ్రోతల్ నడిపిస్తోంది. ఫిల్మ్ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తున్నానని ఆమె చెప్పుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది. 21 ఏళ్ల సెక్స్ వర్కర్‌కు విముక్తి కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.