సైనాకిస్తే నాకూ ఇవ్వాల్సిందే

Posted On:06-01-2015
No.Of Views:312

 పద్మభూషణ్ అవార్డు కోసం ఇప్పుడు బాక్సర్ విజేందర్ కూడా గళమెత్తుతున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా దరఖాస్తును ముందుగా తిరస్కరించినప్పటికీ తను అభ్యంతరం తెలపడంతో క్రీడా శాఖ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.అయితే రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్టు విజేందర్ తెలిపాడు. ‘సైనాకు, నాకు 2010లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రదర్శన పరంగా ఇద్దరం సమానంగానే ఉన్నాం. 2008లో ఒలింపిక్ కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా గేమ్స్‌లో, ప్రపంచ పోలిస్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించాను. ఒకవేళ ఆమె పేరును ఈ అవార్డు కోసం ప్రతిపాదిస్తే నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా’ అని విజేందర్ అన్నాడు.