గోడను ఢీకొన్న కారు... ఇద్దరు విద్యార్థుల మృతి

Posted On:07-01-2015
No.Of Views:288

 నగరంలో గురువారం ఉదయం దారుణం జరిగింది. స్కూలుకు విద్యార్థులను తీసుకెళుతున్న, అదుపు తప్పి గోడను ఢీకొంది. నగరంలోని చాదర్‌ఘాట్‌ విక్టరీ గ్రౌండ్‌ దగ్గర ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.