ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు

Posted On:07-01-2015
No.Of Views:349

 రంగారెడ్డి జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. ఘట్కేసరి మండలం ఏదులాబాద్లో ఆగి ఉన్న బస్సును దుండగులు అపహరించుకుని పోయారు. దీంతో బస్సు డ్రైవర్ పోలీసులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటిలాగే సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గత రాత్రి ఏదులాబాద్ చేరుకుంది.
నైట్ హాల్ట్ కావడంతో డ్రైవర్ బస్సు నిలిపి... నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారే లేచిన డ్రైవర్కు బస్సు కనిపించలేదు. దాంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన బస్సు కుషాయిగూడకు చెందినదని పోలీసులు తెలిపారు.