విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

Posted On:07-01-2015
No.Of Views:288

సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మ (53)ను కోల్పోయింది.  అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జతకలిసిన కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును చక్కదిద్దాడు.108 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్ల సాయంతో  హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా,  భారత్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసిన తెలిసిందే.