ముఖ్య అతిథి గా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు

Posted On:07-01-2015
No.Of Views:291

 పవన్ కళ్యాణ్ ...గెస్ట్ గా ఓ కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఆ కళే వేరు. ఇప్పుడు జనవరి 11న నెల్లూరులో జరగబోయే ‘సంక్రాంతి సంబరం' కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ అతిధిగా హాజరవుతున్నారు. బిజెపి నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. తన స్వస్థలం నెల్లూరులో ఈ ‘సంక్రాంతి సంబరం' కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పండుగ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ వెళ్లటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వెంకటేష్ తో కలసి పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘గోపాల గోపాల', సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాలో పాటలు విడుదలయ్యాయి. వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో పవన్ పాత్ర ఇంటర్వెల్ కు ఐదు నిముషాల ముందు ప్రవేశిస్తారు. ఇంటర్వెల్ ఆయన మీదే వేస్తారు. సెకండాఫ్ లో దాదాపు సినిమా మొత్తం కనపడతారు. మొత్తం అంతా కలిపి ఓ గంట పవన్ ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రం రన్ టైమ్...రెండు గంటల ఇరవై నిముషాలు. అలాగే పవన్, వెంకటేష్ పై చిత్రీకరించిన పాట సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు. పవన్ చెప్పే డైలాగులపై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నారని, అవి సినిమా రిలీజయ్యాక హాట్ టాపిక్ గా మారి, రింగ్ టోన్ లుగా వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. '' అని తెలిపారు. శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్క్రీన్ ప్లే ను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.