డబ్బులు ఎగ్గొట్టిన ఆసిన్

Posted On:07-01-2015
No.Of Views:365

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ ఆసిన్. ప్రస్తుతం సౌత్ సినిమాలకు పూర్తిగా ఉంటున్న ఈ భామ బాలీవుడ్లోనే కొనసాగుతోంది. బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం ‘గజినీ' భారీ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. 2012 తర్వాత ఆసిన్ ఏ ఒక్క సినిమాలోనూ అవకాశం దక్కించుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదిగా అసలు ఆమె వార్తల్లోనే లేదు. తాజాగా ఓ వివాదంతో అసిన్ వార్తల్లో వ్యక్తిగా మారింది. అసిన్ కేరళలోని తన ఇంటిని ఇంటిరియర్ డేకరేషన్ చేయమని ఓ ప్రైవేట్ సంస్థకి పని అప్పగించింది. ఆ సంస్థ దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టి పనిపూర్తి చేసిన తర్వాత అసిన్ ఆ డబ్బులు ఇవ్వడం లేదట. దాంతో సంస్థ నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు అసిన్ ఆడబ్బును 14లోపు జమ చేయాలని, లేకుంటే ఇల్లు వేలం వేయాలని కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసిన్ సినిమాల విషయానికొస్తే....2012 తర్వాత ఏ సినిమాలోనూ నటించని ఆమె ఈ సంవత్సరం ‘ఆల్ ఈజ్ వెల్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా విడుదల కానుంది.