కొత్తగూడెంలో విమానాశ్రయానికై వినతి

Posted On:08-01-2015
No.Of Views:319

ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని పానుగుడుచర్ల వద్ద కొత్తగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుకు లేఖ రాశారు. ఖమ్మం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే,ఇక్కడ నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్ర దేవాలయానికి వెళ్లడానికి సులువు అవుతుందని, కిన్నెరసాని వంటి పర్యాటకకేంద్రాలకు వెళ్లవచ్చని, కొత్తగూడెం,పాల్వంచలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్నాయన్నారు. కొత్తగూడెం సమీపంలో ప్రభుత్వ భూమి 1600 ఎకరాలుందని, దీనిని ఎయిర్‌పోర్టు కోసం కేటాయిస్తామని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు  కేంద్ర మంత్రి స్పందించాలి మరి!