ప్రేమ జంట ఆత్మహత్య

Posted On:08-01-2015
No.Of Views:321

తెలిసీతెలియని వయసులో ఓ అమ్మాయి.. మరో అబ్బాయి మదిలో రూపుదాల్చిన ‘ఆకర్షణ’ మొగ్గలు.. ప్రేమ పేరుతో పువ్వులుగా వికసించాయి. అది ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే వీరిని ఆవహించిన ఆందోళన భూతం ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ఫలితంగా నవమాసాలు మోసిన తల్లులకు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రులకు తీరని శోకం మిగిలింది. ఆ యువ జంట నడుమ చోటు చేసుకున్న నాలుగు నెలల పరిచయం.. ప్రేమగా మారింది..వివాహం చేసుకుందామంటే కులం, పెద్దరికం అడ్డుగా నిలిచాయి.. ఇంట్లో వారిని ఒప్పించలేక.. విడిగా ఉండలేక ఆ ప్రేమికులిద్దరూ ఈ లోకాన్నే వదిలేశారు. తమ ప్రేమను నిరాకరించిన తల్లిదండ్రులకు కోలుకోలేని శిక్ష విధించారు. సిద్దిపేటకు చెందిన విజయ్ (20),  మాధవి (18) బుధవారం హైదరాబాద్‌లోని అల్వాల్ వద్ద రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు వదిలారు.