రాజపక్షే ఘోరఓటమి

Posted On:08-01-2015
No.Of Views:316

శ్రీలంకలో తమిళుల ఊచకోత, ఎల్టీటీఇ చీఫ్‌ వేలుపిళ్ళే ప్రభాకరన్‌,ఆయన కుమారుడిని హతమార్చిన రక్తపు చేతులతో గద్దెనెక్కిన మహింద్ర రాజఫక్షే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యునైటెడ్‌ ప్రతిపక్ష అభ్యర్థి మైత్రిపాల సిరిసేన చేతిలో ఆయన ఘోరంగా ఓటమి పాలయ్యారు. సిరిసేన 51శాతం ఓట్లతో ముందంజలో ఉండగా, రాజపక్షే 47శాతం ఓట్లతో వెనుకబడిపోయారు. సిరిసేనకు మైనార్టీలు ఆధికంగా ఉన్న నార్డ్‌,ఈస్ట్‌,నార్తరన్‌ వెస్ట్‌ ప్రావియెన్స్‌,తమిళులు అధికంగా ఉన్న నార్తరన్‌ ప్రొవియెన్స్‌లో ఎక్కువ మద్దతులభించింది. కోలంబోలో కూడా సిరిసేనకు ఎక్కువ ఆధిపథ్యం లభించింది. పదేళ్లుగా రాజపక్షే శ్రీలంక రాజకీయాల్లో కీలకపాత్ర వహించారు. ఇటీవల ఆయన రాజకీయ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది. ఆయన మంత్రివర్గ సహచరుడైన సిరిసేన ఆయనతో విభేదించి ప్రత్యర్థిగా రంగంలోకి దిగి, చిత్తుగా ఓడిరచాడు.