లంక కొత్త అధ్యక్షుడు సిరిసేన

Posted On:08-01-2015
No.Of Views:316

శ్రీలంక అధ్యక్షుడు, ఒకనాటి తన గురువు అయిన మహింద్ర రాజపక్షేను సులువుగా ఓడిరచిన సిరిసేన ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు కాబోతున్నారు.రెఫరెండంలో సైతం మైత్రిపాల సిరిసేనకు 21 మిలియన్ల జనాభా మద్దతు పలికారు. రాజపక్షకు సన్నిహితుడిగా,స్నేహితుడిగా మెలిగిన మైత్రిపాల సిరిసేన,ఆయన ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో రాజపక్షను ఓడిస్తానని కంకణం కట్టుకోవడమే కాకుండా,ఆయనకు వ్యతిరేకోద్యమం ప్రారంభించారు. వీరిద్దరికీ ఎక్కడ బెడిసిందో తెలియదుకానీ, ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలున్నాయి.
 రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడే సిరిసేన. 1989 పార్లమెంట్‌ ఎన్నికల్లో తూర్పు జిల్లా పోలోనుర్వా  నుండి ఎన్నికయ్యారు.చాలాసార్లు ఎల్టీటీఇ ఉగ్రవాదులు సిరిసేనను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు సిరిసేనను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రెండేళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన వయస్సు కేవలం 20 ఏళ్లే. రాజపక్షే ఓటమి కారణాలేమిటంటే కుటుంబపాలనగా కొనసాగిందనే ఆరోపణలు రావడమే.