అనుష్క ఒక మగాడా?

Posted On:08-01-2015
No.Of Views:396

అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది. ఔను అనుష్క..ఒక మగాడే. నమ్మబోవడంలేదా..త్వరలో రిలీజ్‌ కానున్న ‘రాణీ రుద్రమ దేవి’ సినిమా చూస్తే అనుష్క మగాడా కాదా అన్నది తేలిపోతుంది. కాకతీయ సింహాసనాన్ని అధిష్టించిన రాణీ రుద్రమ దేవికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు రుద్రదేవ. ఆ పాత్రలో కూడా అనుష్క నటించబోతోంది.గుణశేఖర్‌ ఆమెను రుద్రదేవ పాత్రలో మలువబోతున్నాడు. వేరే హీరోను ఈ పాత్రలో పడితే, అనుష్క శెట్టి ఇమేజ్‌ డామేజ్‌ అవుతుందని, ఆమెనే పురుషపాత్రలో నటింపజేసేందుకు గుణశేఖర్‌ ఒప్పించినట్లు టాలీవుడ్‌ సమాచారం. అయితే ఇప్పుడు పురుషపాత్రలో ఎలా ఉండాలో, శరీరతత్త్వం ఎలా ఉంటుందో, తలకట్టు తీరు,వేసుకునే దుస్తులు ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకునే పనిలో అనుష్క పడిరదట?