సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు

Posted On:09-01-2015
No.Of Views:351

నాగపూర్: నగర పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సోషల్ సర్వీస్ వింగ్ గురువారం రాత్రి నాగపూర్‌లోని ఓ హోటల్లో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో హోటల్ మేనేజర్ కూడా ఉన్నాడు. ఇద్దరు యువతులను పోలీసులు పడుపు వృత్తి నుండి కాపాడారు. యువతులలో ఒకరు రాయ్‌పూర్‌కు చెందినవారు. నిందితుల నుండి మూడువేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ ఇన్స్‌పెక్టర్ బాజీరవ్ నేతృత్వంలో ఈ రైడ్ జరిగింది. పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఓ వ్యక్తిని కస్టమర్‌లా పంపించారు. ఓ యువతికి గంటకు ఐదువేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రైడ్ చేశారు. నిందితులు రాకేష్, దేశ్‌బ్రతర్‌లుగా గుర్తించారు. రాకేష్ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. దేశ్‌బ్రతర్ మహిళలను హోటల్స్‌కు సప్లై చేస్తుంటాడు. పోలీసులు రైడ్ చేస్తున్నారని తెలుసుకున్న దేశ్‌బ్రతర్‌ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు ఐదు కిలోమీటర్ల దూరంలో అతనిని పట్టుకున్నారు. దేశ్‌బ్రతర్‌ అక్కడి నుండి పారిపోయిన సమయంలో అతనితో పాటు ముంబైకి చెందిన మరో యువతి ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను ముంబై, పుణే, భోపాల్, రాయ్‌పూర్ నుండి అమ్మాయిలని తీసుకు వచ్చి హోటల్స్‌కు సప్లై చేస్తుంటాడు. వారిని టాప్ హోటల్స్‌లో హైరేట్స్‌కు సప్లై చేస్తుంటాడు. పలు హోటల్లలో దేశ్‌బ్రతర్‌ లాగా పని చేసే వారు ఉండి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.