11వ సారి అధ్యక్షుడిగా కరుణానిధి

Posted On:09-01-2015
No.Of Views:369

 చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా శుక్రవారం కరుణానిధి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికవ్వడం ఇద 11వ సారి. పార్టీ ప్రధాని కార్యదర్శి, కోశాధికారులుగా అన్భళగన్, స్టాలిన్‌లు మళ్లీ ఎన్నికయ్యారు. ఇక పార్టీ మహిలా విభాగం కార్యదర్శిగా కరుణానిధి కూతురు కనిమొళి ఎన్నికయ్యారు. మాజీ మంత్రులు సుబ్బలక్ష్మీ, జగదీశన్, సద్గుణపాండ్యన్, వీపీ దురైస్వామి, పెరియాస్వాములు పార్టీ డిప్యూటీ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగినా చివరకు ఆయన్నే ఆ పదవి వరించింది. డా. కళైనార్‌గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవి తంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.