మహేష్‌,ఎన్టీఆర్లకు అభిమానుల మొట్టికాయలు

Posted On:09-01-2015
No.Of Views:328

ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసేసి, ఇవి చూసి,తరించండంటే అభిమానులు ఇప్పుడు ఒప్పుకునేలా లేరు. వాళ్లకు నచ్చేలా సినిమాలు తీయాల్సిందే నంటున్నారు.ఇప్పటికే ప్రిన్స్‌ మహేష్‌బాబుకు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు అభిమానుల షాక్‌ తగిలింది. ఎలాగంటారా!దీన్ని చిత్తగించండి.
 బెంగుళూరుకు చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌,తమ అభిమాన హీరో పరిస్థితిపై బాధపడుతూ ఒక వీడియో తీశారు. ఈ వీడియోను యూటూబ్‌లో పెడితే 50,000 హిట్స్‌ కూడా వచ్చాయి. ఈ వీడియోలో ఉన్నదేమిటంటే జూనియర్‌ ఎన్టీఆర్‌కు సలహా..ఒక రకంగా హెచ్చరిక కూడా. ‘ప్రయోగాలు చేయడం ద్వారా ఎంత రిస్కో ఇటీవల వచ్చిన సినిమాలు నిరూపించాయి. ఇష్టపడి,కష్టపడి చేసిన రాఖీ,యమదొంగ సినిమాలు ఎంత హిట్లో అందరికీ తెలుసు. రభస,రామయ్య వస్తావయ్యలాంటి సినిమాల జోలికి వెళ్లవద్దు.ఇలాంటి చిత్రాల వల్ల అద్భుతాలేమీ రావు. పైగా అభిమానులు నిరాశ చెందుతారు.అభిమానులు మెచ్చేలా చిత్రాలు తీయాలి.ప్రయోగాల జోలికి వెళ్లవద్దనడం లేదు.కానీ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకోవాలని’ అభిమానులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఓ చిన్న హెచ్చరిక జారీ చేశారు. అది ఆయన చూశాడో లేదో కానీ, సోషల్‌ వెబ్‌సైట్లల్లో ఇది హల్‌చల్‌ చేస్తోంది. 
 ఇక ప్రిన్స్‌ మహేష్‌బాబు అభిమానులేం తక్కువ కాదు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగు ఫ్యాన్స్‌ ఇలాంటి ట్రీట్‌మెంటే ఇచ్చారు. ఆగడు సినిమా రిలీజ్‌ తర్వాత వాళ్లు తమ అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.’ఇలాంటి చెత్త సినిమాలు చేయడం మానేయాలి. నీ తెలివితేటల్ని, సమయాన్ని, నీ అద్భుతమైన నటనను పాడుచేసుకోవద్దు’
 నిజంగా అభిమానులు ఎంత మంచివారండి. మంచి సినిమాలు తీస్తే ఆకాశానికి ఎత్తేస్తూ ముద్దు చేస్తారు. సినిమా బాక్సాపీసు ముందు బోల్తా కొట్టిందనుకోండి. అంతేసంగతులు. అందుకే సినిమా తీసేటప్పుడు అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏమంటారు?