జాకీచాన్ కుమారుడికి జైలు శిక్ష

Posted On:09-01-2015
No.Of Views:333

బీజింగ్: నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నటుడు, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీచాన్ తనయుడు జాయ్ సీ చాన్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీనితోపాటు రూ. 326 డాలర్ల జరిమాన విధించినట్లు తీర్పులో పేర్కొంది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని...  జాయ్ సీ చాన్.. ఫాంగ్ జుమింగ్గా అభిమానులకు సుపరిచయం.ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన  పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన కోర్టు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది.