త్రిష తన ఉడ్ బి తో తొలి సెల్ఫీ

Posted On:09-01-2015
No.Of Views:318

నటి త్రిష, పారిశ్రామికవేత్త- సినీ నిర్మాత వరుణ్‌లకు ఈనెల 23వ తేదీన వివాహ నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా వీరిద్దరూ కలిసి సరదగా ఇదిగో ఇలా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీ చూస్తూంటే వీరిద్దరూ ఎంత గాఢంగా ప్రేమలో మునిగి తేలుతున్నారో అర్దం అవుతోంది. మీరూ ఆ ఫొటోని ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష, తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ వంటి అగ్రహీరోలతోనూ పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి ఆ తర్వాతి తరం హీరోలతోనూ నటించింది. ఇప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో నటిస్తోంది. 'వాయై మూడి పేసవుం' తమిళ చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో త్రిష ప్రేమాయణం సాగిస్తున్నట్లు, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు గతంలో వార్త లొచ్చాయి. అప్పట్లో ఈ వార్తలను త్రిష, ఆమె తల్లి ఉమా కృష్ణన్‌ కూడా ఖండించారు. ఈ నేపథ్యంలో తన నిశ్చితార్థం జరగనున్న విషయాన్ని త్రిష ట్విట్టర్‌లో ప్రకటించింది. 'రానున్న 23న వరుణ్‌తో నా నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఇష్టమొచ్చిన తేదీలను రాయొద్దని కోరుకుంటున్నా. సినిమాల నుంచి విరమించుకునే ఆలోచన ప్రస్తుతం నాకు లేదు. త్వరలోనే రెండు కొత్త చిత్రాలకు సంతకాలు చేయనున్నా. నేను నటించిన నాలుగు కొత్త చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'నని చెప్పింది.