అమరులయ్యేందుకు మేం సిద్ధం: ప్యారిస్ ఉగ్రవాదులు

Posted On:09-01-2015
No.Of Views:334

ప్యారిస్ : ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో పత్రికపై దాడిచేసి 12 మందిని చంపిన ఉగ్రవాదులు.. తాము అమరులయ్యేందుకు సిద్ధమని చెబుతున్నారు. ఫ్రెంచి పోలీసులతో వాళ్లు మాట్లాడినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. ప్యారిస్ ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాద సోదరులు ఇద్దరినీ పోలీసులు వెంబడించగా వాళ్లు ఓ ప్రింటింగ్ ప్రెస్లో దాక్కున్న విషయం తెలిసిందే.వారిని పట్టుకోడానికి తీవ్రస్థాయిలో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారితో ఫోన్లో మాట్లాడినట్లు ఫ్రెంచి అధికారులు చెప్పారు. మరోవైపు.. తాము చేస్తున్న యుద్ధం ఉగ్రవాదం మీదనే తప్ప.. మతం మీద కాదని ఫ్రాన్సు ప్రధాని హోలండ్ తెలిపారు.