జబర్దస్త్ నటులపై కేసు నమోదు

Posted On:09-01-2015
No.Of Views:442

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంలో పలువురు నటీనటులతోపాటు న్యాయ నిర్ణేతలపై కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఈటీవీలో అక్టోబర్ 30న రాత్రి 9.30 గంటలకు జబర్ధస్త్‌లో ప్రసారమైన కామెడీ షోలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలను అగౌరవపరిచే విధంగా మద్యం సేవించినట్లు అమర్యాదగా ప్రవర్తించినట్లు చూపించారని తిమ్మాపూర్‌కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు.. జబర్దస్ నటులు శేషు, సుధాకర్, యాంకర్ రష్మీ, న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజాపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని  పోలీసులను ఆదేశించింది.