హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవన్‌

Posted On:09-01-2015
No.Of Views:362

హైదరాబాద్‌లో బ్రాహ్మణ భవన్‌ను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన అర్చక సంఘం సదస్సులో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఆర్ధికంగా అర్చకులు పరిపుష్టంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. అర్చకుల జీతాలను రూ. 6000 లకు పెంచుతామని కేసీఆర్‌ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో వేద పాఠశాల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నామని అన్నారు.జౌట: