సగం హిందూ, సగం ముస్లింగా కరీనా ఫోటో

Posted On:09-01-2015
No.Of Views:348

విశ్వహిందూ పరిషత్‌ పత్రిక హిమాలయ ధ్వని కవర్‌ పేజీపై నటి కరీనా ఫోటోను ఉపయోగించుకోవడం వివాదాస్పదంగా మారింది. హిందూ మతానికి చెందిన యువతులను లవ్‌ జీహాదీ పేరిట పెళ్లి చేసుకుని ముస్లింలుగా మారుస్తున్నారంటూ విహెచ్‌పీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీనా కపూర్‌ ముఖ చిత్రానికి ఒక భాగం బురఖా, మరో భాగం హిందూ సంప్రదాయం కలిగిన యువతిగా నుదిటిన బొట్టుతో ఉన్న ఫోటోను పత్రిక కవర్‌పేజీపై చిత్రించారు. దీనిపై కరీనాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని వీహెచ్‌పీ నేతలు సవాల్‌ విసిరారు.వివరాల్లోకెళితే.. కరీనాకపూర్‌ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కారణంగా ఆమె ప్రభావంతో హిందూ యువతులు, ముస్లిం యువకులు పెడదారిన పడుతున్నారని వీహెచ్‌పీ నేతలు వాదిస్తున్నారు. ప్రేమ పేరుతో హిందూ యువతులను పెళ్లి చేసుకుని ఆ తరువాత వారిని బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తున్నారని వీహెచ్‌పీ ఆరోపిస్తుంది. దీనికి నిరసనగానే కరీనా ఫోటోను ప్రచురించామని, దీనిపై ఆమెకు అభ్యంతరం ఉంటే కోర్టులో కేసు వేసుకోవచ్చని విహెచ్‌పీ నేతలు చెప్పారు.