మొబైల్ టారిఫ్‌లకు రెక్కలు !

Posted On:10-01-2015
No.Of Views:348

స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర అధికంగా ఉండటంతో మొబైల్ సర్వీసుల రేట్లు పెరుగుతాయని సీఓఏఐ పేర్కొంది. ఈ అధిక ధర టెలికం కంపెనీల విస్తరణపై  ప్రభావం చూపుతుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వివరించారు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న డిజిటల్ ఇండి యా కార్యక్రమంపై కూడా ప్రతికూల ప్రభావం చూ పుతుందని పేర్కొన్నారు.స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర అధికంగా ఉందని, దీంతో కంపెనీల వ్యాపారంపై ప్రభా వం పడుతుందని ఫలితంగా మొబైల్ కంపెనీలు టారిఫ్ లు పెంచుతాయని వివరించారు. దీంతో చౌక ధరల్లో సేవలందించడం, గ్రామాల్లో విస్తరణ, డిజిట ల్ ఇండియా వంటి కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఒక లేఖ రాశారు.