చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదు

Posted On:10-01-2015
No.Of Views:332

దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. డబ్బు కోసం చక్రి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ అతని భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  శ్రావణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబసభ్యులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గతంలో శ్రావణి అత్తింటివారు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.