సానియా జంటకు షాక్

Posted On:10-01-2015
No.Of Views:346

న్యూఢిల్లీ: బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-సు వి సెయి ద్వయం 6-4, 6-7 (1/7), 8-10తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట చేతిలో ఓడిపోయింది.గంటా 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సానియా జంట నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి ఓటమి పాలైంది. సెమీస్‌లో ఓడిన సానియా జోడీకి 13,194 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 22 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.