స్టార్‌ లవర్స్‌ విడిపోతున్నార్ట!

Posted On:10-01-2015
No.Of Views:335

టాలీవుడ్‌ స్టార్‌ లవర్స్‌ మధ్య పొరపొచ్చాలొచ్చాయి. వాళ్లెవరో మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది. లవర్‌బాయ్‌ సిద్ధార్థ,చెన్నై గాళ్‌ సమంత. గత కొద్దిరోజుల మధ్య ఇద్దరి మధ్య ‘ట్వీట్‌’ కోల్డ్‌వార్‌ జరుగుతుందట. ‘ఇప్పుడు నా జీవితంలో చీకటి రాజ్యమేలుతుంది. భగవంతునిపై నాకు నమ్మకముందని’సిద్ధార్థ ట్వీట్‌ చేశాట్ట. దానికి చెన్నై చిన్నది ‘దీనికి నేను మాత్రమే బాధ్యురాలిని కాను.ఇదంతా వ్యక్తిగతం’ అని బదులిచ్చింది(ట). వీళ్ల మధ్య ఇంత దూరం పెరగడానికి సిద్ధార్థ కో`స్టారేనని వినికిడి. సిద్ధార్థ ఈ మధ్య ‘ఎనెక్కుల్‌ ఒరువాన్‌’ సినిమాలో నటించాడు. కో`స్టార్‌ దీప సన్నిధితో మనవాడు అత్యంత సన్నిహితంగా తిరిగాట్ట. ఇది తెలిసి సమంత సిద్ధార్థను తిట్టేసిందట. తమ మధ్య ఏమీ లేదని, దీప మంచి స్నేహితురాలేనని సిద్ధార్థ నచ్చజెప్పాడట. అయితే సమంత వినిపించుకోలేదు. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరి మధ్య మాటల్లేవ్‌. ట్వీ(తి)ట్లు తప్ప. సో ఈ స్టార్ల ప్రేమ కహానీకి ఫుల్‌స్టాఫ్‌ పడ్డట్టే!