గోపాల..గోపాల యావరేజ్‌ట్ట!

Posted On:10-01-2015
No.Of Views:335

ఫస్ట్‌ డే..ఫస్ట్‌ షో రిజల్డ్‌ వచ్చేసింది. గోపాల గోపాల సినిమా యావరేజ్‌గా ప్రేక్షకులు ముద్ర వేశారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ సినిమాకు ఐదు స్టార్లు ఇచ్చేసింది. 
 కథ మీకు తెల్సిందే. హిందీలో వచ్చిన ‘ఓ మై గాడ్‌’కు రిమేక్‌. దీన్ని అక్షయ్‌కుమార్‌,పరేష్‌రావెల్‌ ధరించిన పాత్రల్ని పవన్‌కళ్యాణ్‌,వెంకటేష్‌ పోషించారు. 
అక్కడ ఒకరు క్యారెక్టర్‌ యాక్టర్‌, మరొకరు హీరో. ఇక్కడ సీన్‌ మారింది. ఇద్దరూ అగ్రహీరోలే. కనుక దర్శకుడు సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్‌ పాటించాల్సిందే!
 ఒక్కసారి పాత సినిమాలను గుర్తు తెచ్చుకోండి. ఎన్టీఆర్‌,కృష్ణ నటించిన ‘వయ్యారి భామలు, వగలమారి భర్తలు’ ఇద్దరూ స్టార్‌ హీరోలే. కనుక ఎన్టీఆర్‌కు మూడు పాటలుంటే కృష్ణకు అన్నే ఉండాలి. ఎన్టీఆర్‌కు ఎన్ని ఫైట్లు ఉంటే, కృష్ణకు అన్నే ఉండాలి. అదే ఫార్ములా ఇక్కడ పాటించాల్సిందే!
 మొత్తానికి ఇద్దరు పోటీ పడి నటించారని వినిపిస్తోంది.కోర్టు సన్నివేశాల్లో వెంకటేష్‌ భావోద్వేగాలను పండిరచారు.  గాడ్‌మెన్‌గా నటించిన మిధున్‌ చక్రవర్తి బాగా మెప్పించారు. కోర్టు సీన్లు, పాటలు బాగా రక్తికట్టాయి.  దర్శకుడు కిరణ్‌కుమార్‌ పార్థసాని, ఒరిజనల్‌ను యథాతథంగా ఉంచడానికి చాలా శ్రమించాడు.