మరో వారసుడు రాబోతున్నాడు

Posted On:10-01-2015
No.Of Views:336

టాలీవుడ్లో మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నాడు. సహజ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తనయుడు శ్రేయన్ కపూర్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. శ్రేయన్ నటించే సినిమా త్వరలోనే ప్రారంభంకానున్నట్టు సమాచారం.జయసుధ, శ్రేయన్ గత కొన్ని నెలలుగా పలు కథలు విన్నారు. చివరకు ఓ స్క్రిప్ట్ను ఖరారు చేశారు. జయసుధకు ఇద్దరు కుమారులు. శ్రేయన్ చిన్నవాడు. ఏ రంగంలో స్థిరపడాలన్న జయసుధ తన వారసుల నిర్ణయానికే వదిలేశారు. శ్రేయన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో ఆమె ప్రోత్సహించారు. శ్రేయన్ నటించే ఈ సినిమాకు వాసు మంతెన దర్శకత్వం వహించనున్నారు. ఆయనే ఈ సినిమాను నిర్మించే అవకాశమున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. హైదరాబాద్కు చెందిన వాసుకు ఇదే తొలి చిత్రం. ఆయనకు పలు విద్యాసంస్థలున్నాయి.