‘గోపాల గోపాల’ షో నిలిపివేత

Posted On:10-01-2015
No.Of Views:403

‘గోపాల గోపాల' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్‌పై దాడి జరిగింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లోని థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో షో మధ్యలోనే నిలిపి వేసారు. దాడి చేసింది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. అయితే సినిమాపై వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య వివాదాల పాలైన సినిమాలు కలెక్షన్లు బాగా సంపాదించాయి. ‘పికె' చిత్రంపై పలు మత సంస్థలు చేసిన ఆందోళన ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అయ్యాయనే వాదన కూడా ఉంది. ఫలితంగా ఆ చిత్రం వందల కోట్లు రూపాయల కలెక్షన్ సాధించింది. తాజాగా ‘గోపాల గోపాల' విషయంలోనూ అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని రఘునాథరావు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. సినిమా విడుదల రోజే ఆయన ఫిర్యాదు చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఫిర్యాదు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాల్సిందే. గత వివాదాలు విడుదలుక ముందు నుండే...‘గోపాల గోపాల' చిత్రంపై ఆందోళనలు సాగాయి. ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రాన్నికూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేసారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.