త్రిషకు కళ్లు తిరిగే కానుక ఇవ్వనున్న బాయ్‌ఫ్రెండ్

Posted On:10-01-2015
No.Of Views:296

తమిళ, తెలుగు చిత్రాల్లో ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు తెర వెనకకు వెళ్లిపోయిన ప్రముఖ నటి త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌ను పెళ్లాడబోతోందని, ఈ నెలలోనే నిశ్చితార్థం జరుగబోతోందని త్రిష్ తన ట్విట్టర్ పేజీలో పేర్కొంది. అంతేకాదు.. వీరద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోని కూడా ఆమె మైక్రోబ్లాగింగ్ సైటులో పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో.. నిశ్చితార్థం రోజున త్రిషకు అద్దిరిపోయే కానుక ఇవ్వాలని వరుణ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆ కానుక ఏంటంటే.. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన, అరుదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్. భారతదేశంలో అతి తక్కువ మంది ప్రముఖుల వద్ద ఉండే ఈ కారు ఇకపై త్రిష ఇంటి ముందు కూడా ఉండనుందన్నమాట.త్రిషకు వరుణ్ గిఫ్ట్ చేయనున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఖరీదు సుమారు రూ.7 కోట్లట.