మళ్లీ రానా, బిపాసా రొమాన్స్!

Posted On:10-01-2015
No.Of Views:321

దమ్ మారో దమ్ సినిమాలో విపరీతంగా కెమిస్ట్రీ పండించిన బిపాసా బసు, రానా దగ్గుబాటి మళ్లీ మరోసారి వెండితెర మీద మెరవబోతున్నారు. 'నియా' అనే ఈ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని రానా ఎదురు చూస్తున్నాడట. ఈ సినిమాతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ దర్శకుడిగా అవతారం ఎత్తుతున్నాడు.ఈ సినిమా జీవితం గురించి ఉంటుందని, చాలా అద్భుతమైన సినిమా అని.. బిపాసాతో మరోసారి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని రానా అన్నాడు. విక్రమ్ తన పాత్రను మలచిన తీరు అద్భుతమని చెరప్పాడు. దమ్ మారో దమ్ సినిమాలో రానా.. బిపాసా కేవలం స్క్రీన్ మీదే కాక విడిగా కూడా రొమాన్స్ పండించారన్న రూమర్లు అప్పట్లో గట్టిగా వ్యాపించాయి.  అయితే.. ఆమె చాలా మంచిదని, ముంబైలో తనకున్న ఏకైక స్నేహితురాలు ఆమేనని రానా అన్నాడు.దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రాణా బాలీవుడ్ తెరమీద మెరుస్తున్నాడు. ఇంతకుముందు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఏ జవానీ హై దివానీ సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం బాహుబలి సినిమాలో చేస్తున్నందువల్లే హిందీ సినిమాలకు దూరంగా ఉన్నానని రానా చెప్పాడు. ఆ సినిమాలో తన పాత్రకు భారీ పర్సనాలిటీ అవసరమని, అందుకే కొన్నాళ్ల పాటు ఇతర చిత్రాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం ఆ సినిమా క్లైమాక్స్ ఒక్కటే 120 రోజుల పాటు తీస్తున్నారని అన్నాడు.