రైతులకు ఆంధ్రాబ్యాంకు సేవలను ఉపయోగించుకుంటాం : మంత్రి కేటీఆర్‌

Posted On:10-01-2015
No.Of Views:299

తెలంగాణ రైతులకు ఆంధ్రాబ్యాంకు సేవలను ఉపయోగించుకుంటామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శనివారం నగరంలోని గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ, కొత్తగూడలో ఆంధ్రాబ్యాంకు నూతన శాఖలను మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రైతులకు గ్రీన్‌హౌస్‌, సోలార్‌ పంపుసెట్లు, వ్యవసాయ రుణాలపై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.