కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం

Posted On:10-01-2015
No.Of Views:311

నగరంలోని కుషాయిగూడలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాగార్జునకాలనీలో బాలాజీ ఫర్నీచర్‌ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా మంటలకు ఆహుతైంది.