వరల్డ్‌కప్ తెచ్చే సత్తా ఉంది: కోహ్లీ

Posted On:10-01-2015
No.Of Views:317

ప్రస్తుత భారత జట్టుకు ప్రపంచకప్ తెచ్చే సత్తా ఉందని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విజయం సాధించాలంటే ఆటగాళ్లు తమను తాము విశ్వసించాలని అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. టీమిండియాకు ప్రపంచ కప్ గెలిచే సత్తా ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో తాము బాగా ఆడామని చెప్పాడు. నాకు ఓటమి నచ్చదు తనకు ఓటమంటే అసలు నచ్చదని విరాట్ కోహ్లీ తెలిపాడు. 2-0తో టెస్టును కోల్పోవడం పట్ల తాము నిరాశకు గురికావడం లేదని తెలిపాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా అన్ని విధాలుగా బాగా ఆడిందని తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ అద్భుతంగా రాణించి 692 పరుగులు నమోదు చేశాడు. సిరీస్‌లో తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. నాల్గో టెస్టులో తామే గెలుస్తామని భావించినట్లు తెలిపాడు. అందుకు అవకాశాలు కూడా ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో మ్యాచును డ్రా చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్ మొత్తంలో ఆస్ట్రేలియాకు తమ జట్టు గట్టి పోటీనిచ్చిందని కోహ్లీ చెప్పాడు. ఇదొక అద్భుతమైన సిరీస్ అని తెలిపాడు. నాల్గో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తామని అనుకున్నప్పటికీ విఫలమయ్యామని తెలిపాడు. ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నామని కోహ్లీ తెలిపాడు. తమ జట్టు ఆటగాళ్లు కూడా కొంత మేరకు బాగా రాణించారని తెలిపాడు. ముఖ్యంగా లోకేష్ రాహుల్, మురళీ విజయ్ లాంటి ఆటగాళ్లు తమ శక్తిమేరకు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. మైదానంలో బంతి తగిలి మరణించిన ఫిలిప్ హ్యూస్‌కి ఆస్ట్రేలియా జట్టు సిరీస్ గెలిచి ఘన నివాళి అర్పించిందని అన్నాడు.