యుక్త వయస్సు పిల్లలతో జాగ్రత్త.. ఎలా మాట్లాడాలి!

Posted On:10-01-2015
No.Of Views:377

యుక్త వయస్సు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకూ పిల్లల అభిప్రాయాలను గౌరవించేందుకు ప్రయత్నించాలి. మీరు వాళ్ల కోణంలో ఆలోచిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటే మీతో అన్నీ పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అంతేతప్ప ప్రతీది ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడటం, వాళ్లేది చెప్పినా లేదు, కాదు అనడం సబబు కాదు. పిల్లలతో కొన్నిసార్లు స్నేహితుల్లా ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడటం వల్ల వాళ్ల నుంచి మీరు ఆశించిన సమాధానాలు రాకపోవచ్చు. కలిసి ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడూ, ఎలాంటి హడావుడి  లేకుండా హాయిగా కూర్చున్నప్పుడూ వారితో మాటలు కలపాలి. అప్పుడు వాళ్లు మీ మాటల్ని సానుకూలంగా తీసుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.