ఫేస్ బుక్ దూకుడు: క్విక్ ఫైర్ నెట్‌ వర్క్ సొంతం

Posted On:10-01-2015
No.Of Views:368

ఫేస్ బుక్ దూకుడుగా వ్యవహరిస్తోంది. పోటీకి వస్తాయకునే, తమకు ఉపయోగపడుతాయనే సంస్థలను ఫేస్ బుక్ కొనిపారేస్తుంది. వ్యాపార సూత్రాలు బాగానే వంటబట్టించుకున్న మార్క్ జుకెర్ బర్గ్ ఫేస్ బుక్‌ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.తాజాగా తక్కువ ఎంబీలో వీడియోను నిక్షిప్తం చేసి ఎక్కువ రిజల్యూషన్‌తో చూపించే క్విక్ ఫైర్ నెట్ వర్క్స్‌ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఇందుకు ఎంత ఖర్చైందనే విషయం సంస్థ తెలియజేయకపోయినా.. ఆ సంస్థను ఫేస్ బుక్ కొనేసిందని బ్లాగ్‌లో పేర్కొంది. దీంతో ఫేస్ బుక్‌లో వాట్సప్ వంటి యాప్‌ల సరసన క్విక్ ఫైర్ నెట్ వర్క్స్ కూడా చేరింది.