ఇబ్రహీంపట్టణంలో బ్యాంక్‌ దోపిదీకి దుండగుల యత్నం

Posted On:11-01-2015
No.Of Views:342

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్టణంలో ఓ బ్యాంక్‌ దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా సహకార బ్యాంక్‌లో చోరీకి నలుగురు దుండగులు యత్నించారు. ఆయుధాలు గ్యాస్‌ కట్టర్లతో బ్యాంక్‌ వెనుకభాగంలో ఉన్న కిటికి తొలగించారు. లోనికి ప్రవేశించే సమయంలో పోలీసులు అక్కడకు రావడంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో బ్యాంక్‌ వద్దకు చేరుకున్న అధికారులు చోరీ జరగలేదని నిర్ధారించారు.